ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి.

పెద్దమందడి,ఏపీఓ సురేష్.

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి.

పెద్దమందడి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి మండల ఏపీఓ సురేష్ సూచించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన, గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌కు పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామంలోని కూలీలకు ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి, ఎక్కువ మంది పనులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. వ్యవసాయ పనులు తగ్గిన సమయంలో ఉపాధి హామీ పనులు గ్రామీణ కూలీలకు ఆర్థికంగా ఎంతో తోడ్పడతాయని తెలిపారు. కూలీలకు నిరంతరం పని కల్పించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఓ సురేష్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.