బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.

ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో అణచివేయడం సరికాదు.

బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.

వేలేరు, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల మాంసాభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును వేలేరు మాజీ మండల కన్వీనర్ కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, వాటిని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాజ్యాంగ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగుతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నించే వారిని అరెస్టు చేయడమేనా అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి
పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాస్తూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదు. దూదిమెట్ల బాలరాజు యాదవ్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, ఆయనను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.