వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మువ్వా విజయబాబు.

వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: మువ్వా విజయబాబు.

- బాధిత కుటుంబాలకు పరామర్శ.. ధైర్యం చెప్పి భరోసా.. అల్పాహారం, భోజన ఏర్పాట్లు.

సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు): 

మురసు తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి మండలంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బేతుపల్లి చెరువులో నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీటిలో చిక్కుకున్న బాధిత కుటుంబాలు అనంతరం సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. వరద పరిస్థితుల నేపథ్యంలో మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఎదురైన ఇబ్బందులను, నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టడంతో ఆందోళనకు గురైన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో ఎవరూ అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే వరద బాధితులకు తక్షణ అవసరాలు తీర్చడం ముఖ్యమని భావించి అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేయించారు. ఆపద సమయంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు మానవతా దృక్పథంతో సహాయం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ ఒకటో వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, ఆరో వార్డు కౌన్సిలర్ సుజల రాణి, బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.IMG-20261106-WA0022

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.