అంకమ్మ చెరువు కట్ట తెగి.. నీట మునిగిన పంట పొలాలు.

అంకమ్మ చెరువు కట్ట తెగి.. నీట మునిగిన పంట పొలాలు.

- ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తుఫాన్ నష్టాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల.
- అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటన.. రైతులకు భరోసా.

అశ్వారావుపేట, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు): 

మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో జరిగిన పంట, రహదారుల నష్టాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దమ్మపేట మండలంలో ద్విచక్ర వాహనంపై స్వయంగా పర్యటిస్తూ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. సాధారణ వ్యక్తిలా ద్విచక్ర వాహనంపై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడం విశేషం. అనంతరం అశ్వారావుపేట మండలంలోని అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన అంకమ్మ చెరువు కట్ట తెగిపోవడంతో దిగువ ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబుతో కలిసి చెరువు పరిసర ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టం తీవ్రతను అంచనా వేశారు. పంటలు, రహదారులకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నాటికి నష్టానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందించాలని సూచించిన నేపథ్యంలో మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిని ఆందోళనలో ఉన్న రైతులకు మంత్రి భరోసా కల్పించారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని,జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. IMG-20261106-WA0020

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.