మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జక్కుల మౌనిక-సంపత్ యాదవ్.
Views: 0
On
వేలేరు నవంబర్ 6 ( తెలంగాణ ముచ్చట్లు )
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని పశు వైద్యశాలను గ్రామ సర్పంచ్ జక్కుల మౌనిక-సంపత్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పశువులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సలు, మందుల లభ్యతపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
పశువులకు అనారోగ్యం కలిగినప్పుడు రైతులు, పశుపోషకులు ఇబ్బందులు పడకుండా అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామంలోని పశుసంపద పరిరక్షణకు, పశుపోషకుల సంక్షేమానికి వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Nov 2026 21:13:05
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...


Comments