ఖాదర్ కుటుంబానికి మంత్రి తుమ్మల పరామర్శ.
ఉష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి.
Views: 17
On
సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఖాదర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన భార్య ఉష ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఉష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో పాటు డాక్టర్ మట్టా దయానంద్, విజయ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Nov 2026 21:13:05
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...


Comments