ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీ వెంటనే అమలు చేయాలి.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీ వెంటనే అమలు చేయాలి.

*కనీసం 50 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలి*

*రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నేతల డిమాండ్*

హుజూరాబాద్,నవంబర్ 06(తెలంగాణ ముచ్చట్లు ):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను కనీసం 50 శాతానికి తగ్గకుండా ప్రకటించి, జూలై 2023 నుంచి అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ శాఖ అధ్యక్షుడు భారత ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీకి ప్రభుత్వం ఇచ్చిన ఒప్పంద హామీ ప్రకారం సెప్టెంబర్ 2026 నాటికి పీఆర్సీ నివేదికను తెప్పించుకొని నూతన పీఆర్సీని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం నివేదికను కూడా తెప్పించుకోకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను నిరాశకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి, తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఈహెచ్ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని వారు కోరారు. ఈ పథకం అమలు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నుంచి గత కొన్ని నెలలుగా ప్రభుత్వం 1.5 శాతం కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నప్పటికీ, వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆందోళనకరమన్నారు.
అనారోగ్యానికి గురైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సరైన సమయంలో వైద్య చికిత్స పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈహెచ్ఎస్‌ను ఎలాంటి ఆంక్షలు, జాప్యం లేకుండా పూర్తిస్థాయిలో అమలు చేసి, ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెన్షనర్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
పదవీ విరమణ పొందిన పెన్షనర్లు తమకు రావాల్సిన పెన్షనరీ బకాయిల కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ అనంతరం ప్రశాంతంగా జీవించాల్సిన వృద్ధులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు.
పెండింగ్‌లో ఉన్న పెన్షనరీ బకాయిలను ఏకమొత్తంగా వెంటనే మంజూరు చేయాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా పీఆర్సీ అమలు, ఈహెచ్ఎస్ పూర్తి స్థాయి అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి ప్రధాన సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చందుపట్ల జనార్ధన్, భారత ప్రభాకర్, చీకట్ల సమ్మయ్య తీవ్ర ఆవేదనతో డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.