మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
* 8వ వార్డులో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
* అన్ని వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం
జమ్మికుంట, నవంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మారుతి నగర్‌లో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గురువారం భూమిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జమ్మికుంట మున్సిపాలిటీకి కేటాయించిన రూ.15 కోట్ల నిధుల నుంచి ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్‌తో కలిసి ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వార్డులో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 8వ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కౌన్సిలర్ ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రస్తుత పాలకవర్గం ఉన్నంతకాలం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో 8వ వార్డును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ అవసరాలను గుర్తించి, నిధుల కేటాయింపులకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి పనులకు భూమిపూజలు నిర్వహించి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్, మున్సిపల్ మేనేజర్ గుర్రాల రాజిరెడ్డి, ఏఈ వికాస్, వడ్లకొండ రమేష్, శ్రీకాంత్, రఫీ తదితరులు పాల్గొన్నారు.


Comments