20వ డివిజన్‌లో రూ.31 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
*ధర్మపురి కాలనీలో పైప్ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన మేయర్ , డిప్యూటీ మేయర్.*
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలోని 20వ డివిజన్ రేకుర్తి ప్రాంతం ధర్మపురి కాలనీలో రూ.31 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న పైప్ డ్రైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశంతో కలిసి అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
ధర్మపురి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడనున్నాయి. పైప్ డ్రైన్ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు, సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments