ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.
పెద్దమందడి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లాలో మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్), ఎంఎస్యూను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు తెలిపారు. శుక్రవారం పెద్దమందడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఎస్ఎఫ్, ఎంఎస్యూ సమావేశం నిర్వహించి నూతన కమిటీ ఎన్నిక చేపట్టారు.ఈ సమావేశానికి ఎంఎస్ఎఫ్ వనపర్తి కో-ఇన్చార్జి పుట్టపాగ అజయ్ మాదిగ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా తాజా మాజీ అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇన్చార్జి మొలకలపల్లి పరశురాముడు మాదిగ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొమ్ము చెన్నకేశవులు మాదిగ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంఎస్ఎఫ్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, 22వ తేదీన ఎంఎస్ఎఫ్ జిల్లా నూతన కమిటీని నిర్మించనున్నట్లు వెల్లడించారు. మాదిగ విద్యార్థులు విద్యాపరంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.మొలకలపల్లి పరశురాముడు మాదిగ మాట్లాడుతూ వనపర్తి జిల్లాను ఎంఎస్ఎఫ్ కమిటీల నిర్మాణంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గంధం గట్టయ్య మాదిగ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఎస్ఎఫ్ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సమక్షంలో వెయ్యి మంది విద్యార్థులతో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించేందుకు నాయకులు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి వెంకట్ రాములు మాదిగ, ఎంఎస్ఎఫ్ జూనియర్ కళాశాల అధ్యక్షుడు సాయికుమార్ మాదిగ, భరత్ కుమార్, చందు, అభిలాష్, చందన, శిరీష, మాధురి, అనూజ, వరుణ్ భీమ్ రాజ్ మాదిగ, దీపక్ మాదిగ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Comments