కందుకూరులో మూడు కోట్ల రూపాయల డీసీసీబీ రుణాల పంపిణీ.!
రుణాలను పంపిణీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు):
వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు కోట్ల రూపాయల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల ఆర్థిక ప్రగతికి సహకార బ్యాంకులు అందిస్తున్న సేవలు కీలకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కందుకూరు గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రుణాల పంపిణీ చేపట్టారు. డీసీసీబీ ద్వారా మంజూరైన రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, బ్యాంకు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడో ఉన్న తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని, ఇక్కడి ప్రజలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. సత్తుపల్లి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన రాజకీయ ప్రస్థానంలో ఈ ప్రాంత ప్రజల ఆదరణ, అభిమానం ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. కందుకూరు సభలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్, విజయ్ కుమార్తో పాటు డీసీసీబీ జిల్లా అధికారులు, సత్తుపల్లి నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు, కందుకూరు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments