పేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక భరోసా.

పేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక భరోసా.

పెద్దమందడి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రానికి  చెందిన మన్నెం  అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వనపర్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి వెంటనే స్పందించి, బాధిత నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ‘మేఘన్న అభయ హస్తం’ ద్వారా మృతుని కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే  చూపుతున్న చొరవలో భాగంగా ఈ సహాయం అందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము వెంకటస్వామి, కాంగ్రెస్ నాయకులు సూర్య రవి, 6వ వార్డు సభ్యులు కొమ్ము సత్యనారాయణ, కొమ్ము రాములు, కొమ్ము ఆంజనేయులు, సింగిరెడ్డి మల్లేష్, గట్టు ఆంజనేయులు, ఆర్. నాగరాజు, యం. గోపాల్ తదితరులు పాల్గొని మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తమ కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యే గారికి మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.