కందుకూరులో సింధు హాస్పిటల్ మెగా ఉచిత వైద్య శిబిరం.
శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో సింధు హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైద్య శిబిరాన్ని ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, మట్టా దయానంద్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. వీరితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తుమ్మల అభిమానులు, ఇతర నాయకులు హాజరయ్యారు.


Comments