బుగ్గపాడులో లారీ బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు.

సకాలంలో స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బంది.

బుగ్గపాడులో లారీ బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు.

సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో నాగేంద్రస్వామి ఆలయం సమీపంలోని మూలమలుపు వద్ద శుక్రవారం అన్నపురెడ్డిపల్లి వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ సమీపంలో ఉన్న అదే గ్రామానికి చెందిన చాప నాగలక్ష్మి (60) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) గొల్లమందల కృష్ణ, పైలట్ కట్టం మహేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి, కాలుకు కట్లు కట్టి స్ప్లింటింగ్ చేశారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే క్రమంలో సెలైన్ అందిస్తూ, ఆక్సిజన్ ఏర్పాటు చేసి, ధైర్యం చెబుతూ సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద సమయంలో సకాలంలో స్పందించి బాధితురాలికి వైద్యసేవలు అందించి ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బందిని జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ షేక్ నజీరుద్దీన్, బుగ్గపాడు గ్రామస్తులు అభినందించారుIMG-20261106-WA0011

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.