మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
పెద్దమందడి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి మరియు ఐ. సత్యరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు మద్దిగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కుప్పిరెడ్డి శివారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వి. నరసింహాచారి, కార్యదర్శిగా జుంపాల ఆంజనేయులు, ముఖ్య సలహాదారునిగా జె. నాగేష్ యాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి శివారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మండల పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి , ఐ. సత్యరెడ్డి రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి గ్రామస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతానని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కె. సత్యరెడ్డి, రామచంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచులు పి. నారాయణ, ఎం. కేశవులు, ఉపసర్పంచులు శివరాజు, కె. కేశవులు గౌడ్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, కె. జనార్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగన్న యాదవ్, బుచ్చిలింగం తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


Comments