7న అంజనగిరి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలి.

శశివర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు.

7న అంజనగిరి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలి.

పెద్దమందడి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలంలోని శ్రీ గట్టుకాడిపల్లి (అంజనగిరి) క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నవంబర్ 7వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ సభ్యులు శశివర్ధన్ రెడ్డి కోరారు.ప్రతి నెల 7వ తేదీన స్వామివారిని దర్శించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ నెల కూడా ప్రత్యేక దర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.భక్తులు తమ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా దంపతులు సతీసమేతంగా సంప్రదాయ పద్ధతిలో హాజరుకావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులు ధరించి, నిర్వాహకులు అందించే కండువాలను వేసుకుని కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. భజన కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు తమ భజన బృందాలతో కూడా రావచ్చని తెలిపారు.ప్రతి నెల నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తుల భాగస్వామ్యం పెరగాలని, అందరూ స్వామివారి దర్శనం చేసుకుని ఆ భగవంతుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని శశివర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్. జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు): క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్...
బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన కొయ్యడ మహేందర్.
మల్లికుదుర్ల పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్.
మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.
మారుతి నగర్ అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు.
గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
ఎంఎస్ఎఫ్ బలోపేతానికి నూతన కమిటీల ఏర్పాటు.