మధిరలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో శ్రీ గ్లోబల్ విద్యార్థినుల ప్రతిభా చాటింపు!
*-అండర్-14 బాలికల విభాగంలో చింతకాని మండలం జట్టు తరఫున సత్తా చాటిన విద్యార్థినులు*
*-విద్యార్థినులను అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి*
ఖమ్మం బ్యూరో, నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు )
బుధవారం మధిరలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-14 కబడ్డీ పోటీల్లో బాలికల విభాగంలో చింతకాని మండలం జట్టు తరఫున పాల్గొన్న శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచ విద్యార్థినులు దుర్గా వైష్ణవి మరియు కృషిక ను అద్భుతమైన క్రీడా ప్రతిభను కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. జిల్లా స్థాయి పోటీల్లో మండల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ ఆటతీరుతో ప్రతిభను చాటుకోవడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ గ్లోబల్ హై స్కూల్‌లో విద్యార్థినులను అభినందించే కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి, వారి క్రీడా ప్రతిభను కొనియాడారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరచాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడం ఎంతో సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి పాఠశాలకు, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థినులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. క్రీడల్లో విజయం సాధించడానికి నిరంతర సాధన, పట్టుదల, జట్టుగా సమన్వయంతో పనిచేయడం ఎంతో అవసరమని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు అత్యున్నత ప్రతిపను కనపరచటానికి కారణమైనటువంటి పాఠశాల పీఈటి సమీర్ ను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్‌మెంట్ సభ్యులు వాహిని, సుధాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ తన్నీరు రామారావు, ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించి ప్రశంసించారు.జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో శ్రీ గ్లోబల్ విద్యార్థినులు తమ ప్రతిభను చాటుకోవడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.


Comments