త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ విభాగాన్ని పరిశీలించి, ఫిర్యాదుల స్వీకరణ, నమోదు, పరిష్కారానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయ నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

అనంతరం పోలీసుల పనితీరును సమీక్షిస్తూ, ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా సెక్టార్ అధికారుల బాధ్యతలను వివరిస్తూ, తమ పరిధిలోని ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల గుర్తింపు, సమస్యాత్మక ప్రాంతాల పర్యవేక్షణతో పాటు ప్రజలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని పోలీస్కమిషనర్ ఆదేశించారు.
కార్యక్రమంలో ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి పాల్గొన్నారు. IMG-20261116-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు. పేదల జీవితాల్లో ‘చేయూత’ వెలుగులు.. కొత్త పెన్షన్ల మంజూరు.
*కరీంనగర్‌లో 3,812 మందికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు.* *66 డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.* *వృద్ధులకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలి –...
ఢిల్లీ జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన టి. సూర్యకుమారి.
ఏఎస్సై గా ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
భక్తిశ్రద్ధలతో ఘనంగా ఛఠ్ పూజ వేడుకలు.
బెజ్జంకిలో ఘనంగా నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ.
బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు.