వార్షిక తనిఖీలో వేలేరు పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన కాజీపేట ఏసీపీ

వార్షిక తనిఖీలో వేలేరు పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించిన కాజీపేట ఏసీపీ

వేలేరు, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వేలేరు   పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులను, నమోదైన కేసుల వివరాలను, క్రైమ్ రేటును క్షుణ్ణంగా పరిశీలించి స్టేషన్ పనితీరును సమీక్షించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎస్ఐతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి అక్రమ రవాణా, వినియోగం, సైబర్ నేరాలు తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంపొందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఏసీపీ సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు. రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు.
*తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కోశాధికారిగా కానిగంటి శ్రీనివాస్* *సగర కుల అభ్యున్నతికి మరింత కృషి చేస్తా.. రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు* హుజురాబాద్,నవంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ...
రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్‌కు జమాతే ఇస్లామీ హింద్ మహిళల అభినందన.
రౌడీ గ్యాంగ్ పేరుతో పోస్టులు.. 
ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో బాలల దినోత్సవం.
సగరుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలి.