ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.

ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.

ఖమ్మం బ్యూరో, నవంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ పరిపాలనను మరింత పటిష్టం చేయడం, విధుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేస్తూ, కేవలం కార్యాలయ స్థాయిలోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పోలీస్ స్టేషన్ వారీగా సమగ్ర సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల తీరు, పెండింగ్ కేసులు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. అనంతరం ఏసీపీ కార్యాలయ ఆవరణలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని చాటిచెప్పారు. కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు సాధిక్ పాషా, రామకృష్ణ, చిట్టిబాబు,నాగరాజు కరుణాకర్ పాల్గొన్నారు.IMG-20261111-WA0032

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!