సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.

సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.

* విద్యారంగ పరిరక్షణకు పోరాటాలే మార్గం.. 

* పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్

జమ్మికుంట, నవంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

శాస్త్రీయ విద్యా విధానం, సమసమాజ స్థాపన, విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాడి అమరులైన విప్లవ విద్యార్థి అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, నేటి విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు.

జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విప్లవ విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించి వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై అనుసరిస్తున్న విధానాలు విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, నాణ్యమైన శాస్త్రీయ విద్య అందరికీ అందుబాటులోకి రావడం కోసం విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయకార్యదర్శి కొనేటి ప్రశాంత్, డివిజన్ ఉపాధ్యక్షుడు పొడిశెట్టి అశోక్, నాయకులు రాజేష్, శ్రావణ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. IMG-20261107-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.