గంగపుత్ర భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధుల కేటాయింపు.

గంగపుత్ర భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నిధుల కేటాయింపు.

*సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..*

*కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి*

కరీంనగర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో భాగంగా ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో గంగపుత్ర భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు కేటాయించిన సందర్భంగా కరీంనగర్ ఫిష్ మార్కెట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెస్ ఫిషరీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నాగుల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

గంగపుత్రుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.