స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
పర్యావరణ సహిత దీపావళి కోసం స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల ప్రయత్నం.
ఖమ్మం బ్యూరో,నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు )
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం కాలుష్య రహితంగా, పర్యావరణహితంగా గ్రీన్ దీపావళి వేడుకలను సంబరంగా నిర్వహించారు.
పాఠశాల ఆవరణమంతా రంగురంగుల ముగ్గులతో, పూల ముగ్గులతో తీర్చిదిద్దారు.
అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో నూనె ప్రమిదలను వెలిగించి దీపావళి వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా జరిపారు. గ్రీన్ దీపావళి సందేశాన్ని చెబుతూ స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు నిర్వహించిన దీపావళి సంబరాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ దీపావళి వేడుకలను పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చెడుపై మంచి విజయం సాధించిన ప్రతీకగా పురాణాల కాలం నుంచి దీపావళి సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. దీపావళి వెలుగుల ప్రస్థానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని తెలిపారు. కాలుష్యాన్ని కలగజేయకుండా, పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా దీపావళి వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.


Comments