సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
* ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా
* రక్తదాన శిబిరం, అనాథ విద్యార్థులకు అన్నదానం, మొక్కల నాటకం
జమ్మికుంట, నవంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):
జన్మదిన వేడుకలను ఆడంబరాలకు దూరంగా ఉంచి, సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా నిర్వహిస్తూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆదర్శంగా నిలిచారు. తన పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఆటో డ్రైవర్ సోదరులకు గెలాక్సీ ఇన్సూరెన్స్ ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ప్రతిరోజూ రహదారులపై ప్రయాణిస్తూ ఎన్నో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటారని, అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తన సోదరుడు చింటూ తండ్రి చొక్కారపు శ్రీనివాస్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి మృతి చెందారని, ఆ సమయంలో బీమా లేకపోవడంతో కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొందని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మరే ఆటో డ్రైవర్ కుటుంబానికి రాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
పట్టణంలోని ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా ప్రమాద బీమా లేకుండా ఉండకూడదని, ఆటో యూనియన్ అధ్యక్షులు, సభ్యులు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు మేకల సాగర్ రెడ్డి, జక్కే శివ, చింటూతో పాటు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు, భోజనం పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బొమ్మలగుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.
ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, సేవా కార్యక్రమాల్లో ముందుండే నాయకుడిగా ప్రశాంత్ కుమార్ దిలీప్ జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన ఈ కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. వ్యక్తిగత వేడుకలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలుగా మలచడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.


Comments