బీసీ-ఏ హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదు.

వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట నిరసన.

బీసీ-ఏ హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదు.

వనపర్తి,నవంబర్07( తెలంగాణ ముచ్చట్లు):

బీసీ-ఏ వర్గాల హక్కులు, రిజర్వేషన్ అవకాశాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఏవోకు నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులాన్ని ప్రస్తుతం బీసీ-డి నుంచి బీసీ-ఏలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బీసీ-ఏ జాబితాలో ఉన్న 57 కులాలకు ఈ ప్రతిపాదన వల్ల రిజర్వేషన్ అవకాశాలు తగ్గి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రజక, వాల్మీకి, వడ్డెర, నాయీ బ్రాహ్మణ, మేదర, బెస్త, గంగపుత్ర, గంగిరెడ్డి తదితర వెనుకబడిన కులాలకు దక్కాల్సిన రిజర్వేషన్ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. బీసీ-ఏలోని కులాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఏదైనా వర్గాన్ని మరో కేటగిరీలో చేర్చే నిర్ణయం తీసుకునే ముందు ఇప్పటికే ఆ జాబితాలో ఉన్న కుల సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ప్రభుత్వం ముదిరాజ్ కులాన్ని బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసి బీసీ-ఏలో ముదిరాజ్ కులాన్ని చేర్చడం వల్ల ఇప్పటికే ఆ వర్గంలో ఉన్న కులాలకు ఎదురయ్యే నష్టాలను వివరించి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో రజక నాయకులు రంగస్వామి, పుల్లయ్య, గోపాల్, కృష్ణయ్య, పాండురంగ, బోయ నాయకులు వెంకటనారాయణ, మహేశ్వర్, నాయీ బ్రాహ్మణ నాయకులు నరేష్ కుమార్, రవి, నరేష్, వడ్డెర నాయకులు మోహన్ బాబు, కురుమూర్తి, ఈశ్వర్, మేదర తదితర బీసీ-ఏ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.