ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.

ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.

ముల్కనూర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు): 

ముల్కనూర్‌లోని ఏకేవీఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రీన్ దీపావళి కార్యక్రమాన్ని చేపట్టారు.

బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ మాట్లాడుతూ.. దీపావళి వెలుగుల పండుగ అని, పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ దీపావళి కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం పెంపొందించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కాలుష్యరహిత దీపావళి.. ఆరోగ్యకరమైన సమాజానికి పునాది!

Tags:

Post Your Comments

Comments

Latest News

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
ఖమ్మం బ్యూరో,నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు )  స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం కాలుష్య రహితంగా, పర్యావరణహితంగా గ్రీన్ దీపావళి వేడుకలను సంబరంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణమంతా...
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.
ముల్కనూర్‌లో అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలు.