తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు.

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.

తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు.

వనపర్తి,నవంబర్07(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి పట్టణంలోని తిరుమలయ్య గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే మేఘారెడ్డి  దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు గుట్ట దిగువన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే గుట్టపైకి బోరు ద్వారా మంచినీటిని అందించేందుకు పైపులైన్ ఏర్పాటు పనులను తన సొంత ఖర్చులతో చేపడతానని హామీ ఇచ్చారు.తిరుమలయ్య గుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం భక్తులు ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి. కృష్ణ, మాజీ కౌన్సిలర్లు, పట్టణ, మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.