ఆలయ అభివృద్ధికి సర్పంచ్ జక్కుల మౌనిక ప్రత్యేక చొరవ.

ఆలయ అభివృద్ధికి సర్పంచ్ జక్కుల మౌనిక ప్రత్యేక చొరవ.

వేలేరు, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి గ్రామ సర్పంచ్ జక్కుల మౌనిక-సంపత్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా 2023 మే 7న ఆలయ పూజారికి గంగిరేగి చెట్టును బహూకరించి, స్వయంగా ఆలయ ప్రాంగణంలో నాటించారు. ప్రస్తుతం ఆ చెట్టు పెరిగి స్వామివారి నిత్య పూజా కార్యక్రమాలకు అవసరమైన గంగిరేగి ఆకులను అందించే స్థాయికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన తరహాలోనే మల్లికుదుర్ల ఆలయంలోని గంగిరేగి చెట్టు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును తన సొంత నిధులతో భరిస్తానని ఆలయ ఈవో, పూజారులు, ఒగ్గు పూజారులకు తెలిపారు.
గ్రామ అభివృద్ధితో పాటు దేవాలయాల అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని సర్పంచ్ చూపుతున్న చొరవపై ఆలయ వర్గాలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.