రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో హనుమకొండ జిల్లాకు మూడో స్థానం..

సత్తా చాటిన వేలేరు గురుకుల విద్యార్థులు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో హనుమకొండ జిల్లాకు మూడో స్థానం..

వేలేరు నవంబర్ 7 ( తెలంగాణ ముచ్చట్లు )

హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-17 కబడ్డీ పోటీల్లో హనుమకొండ జిల్లా జట్టు మూడో స్థానం సాధించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో వేలేరు టీజీఆర్ఎస్ అండ్ జేసీ (బాలుర) గురుకుల కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కీలక పాత్ర పోషించి ప్రతిభ చాటారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థి సోంపెల్లి రోహిత్ తేజ హనుమకొండ జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. చందు, విజయ్, రిత్విక్‌లు సైతం తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. రౌతు అజయ్ కుమార్ విద్యార్థులను అభినందిస్తూ, క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.