కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.

సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసిన చిన్నారులు.

కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.

కరీంనగర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్ & ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో ముద్దుగా అలంకరించుకుని, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు “శుభ దీపావళి”, “హ్యాపీ దివాళి” అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం ప్రమిదలు వెలిగించి, రంగురంగుల రంగవల్లులు దిద్దుతూ పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, ప్రసాదం పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు వేడుకల్లో చురుకుగా పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ జక్కుల గిరిబాబు కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఉత్సాహపరిచి ఆశీర్వదించారు. దీపావళి పండుగ విశిష్టతను, చీకటిని పారద్రోలి వెలుగులు నింపే ఈ పండుగ అంతరార్థాన్ని పిల్లలకు వివరించారు.

పండుగ వాతావరణంలో చిన్నారుల ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా ముగిశాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి. బాణాసంచా దుకాణాల్లో నిబంధనలు పాటించాలి.
సిగరెట్‌, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు ) దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు.
సమసమాజ స్థాపన కోసం విద్యార్థులు ఉద్యమించాలి.
సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు.
ఏకేవీఆర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు.
కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
కరీంనగర్ కిడ్స్ కేర్ సెంటర్‌లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.