పోలేపల్లిలో భక్తిపారవశ్యం..
- *కన్నులపండువగా అయ్యప్ప ‘మహా పడిపూజ’*
- *మారుమోగిన శరణుఘోష*
- *రామన్నపేట భక్త బృందం భజనలు భేష్*
ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 26(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామం శరణుఘోషతో మారుమోగింది. గ్రామానికి చెందిన కన్నె స్వామి దండగల వీరబాబు నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజ వేడుక అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించబడింది.
- *శాస్త్రోక్తంగా అభిషేకాలు...*
గొలుసుల తిరుమల రావు గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి పాలు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పూజా పీఠాన్ని నానావిధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పడిపూజను సోమవారం వైభవంగా జరిపారు.
- *ఆకట్టుకున్న భక్తి భజనలు...*
ఈ సందర్భంగా ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట అయ్యప్ప భక్త బృందం సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు, మంగళ హారతులు భక్తులను విశేషంగా అలరించాయి. 'స్వామియే శరణం అయ్యప్ప' నినాదాలతో పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
- *పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్వాములు...*
ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గురుస్వాములు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, చింతకాయల అంజయ్య, బరిగల శేఖర్, కట్ల నరసింహారావు, ఐతనబోయిన వెంకట్రావు, లక్ష్మణ్, కూచిపూడి మురళి, వీరబాబు, నాగరాజు,
బండి మనోజ్, ఏటూకూరి నవీన్, తీగల కృష్ణ, కె. నరసింహారావు,
మానుకొండ వెంకటేశ్వరరావు, ఆడపా ఆంజనేయులు, మడికంటి శ్రీను, వీరా నారాయణ, పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, గ్రామస్థులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.


Comments