గట్లఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.

గట్లఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.

పెద్దమందడి,అక్టోబర్26తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్లఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు 14 మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గ్రామ అధ్యక్షుడు చుక్క రవి, కృష్ణ, రమేష్, నాగరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి నిరంజన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకులు కె. కృష్ణ వాల్మీకి, కె. ఆంజనేయులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా తమ గ్రామంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా నెరవేర్చలేదని, సాగునీరు అందిస్తామని చెప్పి పట్టించుకోలేదని విమర్శించారు. కార్యకర్తల సమస్యలను కూడా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మధు, చెన్నయ్య, రాములు, చందు, నాగన్న, వెంకటస్వామి వాల్మీకి, శివశంకర్, పి. శివ, పి. ఆనంద్, కె. నాగరాజు, రమేష్ వాల్మీకి తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి.
- కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జారె పిలుపు.- దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన. దమ్మపేట, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్...
రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ.
సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు.
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ.
నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.
వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
29న పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశం.