వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం.

వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

పెద్దమందడి,అక్టోబర్26(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆదికవి శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి మహర్షి తన జీవిత పరివర్తనతో సమాజానికి గొప్ప సందేశాన్ని అందించారని తెలిపారు. రత్నాకరుడి నుంచి తపస్సు, సాధనతో మహర్షిగా ఎదిగి, సత్యం, ధర్మం, న్యాయం వంటి విలువలను ప్రపంచానికి చాటిన మహనీయుడని కొనియాడారు.వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మానవాళికి ధర్మమార్గాన్ని బోధించే గొప్ప ఇతిహాసమని, అందులోని ఆదర్శాలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రాసంగికమని అన్నారు. సీతమ్మకు ఆశ్రయం కల్పించి, లవకుశులకు విద్యాబుద్ధులు నేర్పిన కరుణామయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలను జీవితంలో ఆచరించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాములమ్మ, మాజీ ఎంపీపీ మనేపరెడ్డి, వార్డు సభ్యులు కృష్ణ, నరేష్, యాదయ్య, యాదమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి, రమేష్ గౌడు, కొంకల నరసింహ, వెంకటయ్య, వాల్మీకి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి.
- కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జారె పిలుపు.- దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన. దమ్మపేట, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్...
రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ.
సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు.
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ.
నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.
వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
29న పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశం.