ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ.

ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ.

 *హామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం*

– డా. కె.వి. కృష్ణారావు

ఖమ్మం బ్యూరో అక్టోబర్ 26(తెలంగాణ ముచ్చట్లు )

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డా. కె.వి. కృష్ణారావు పేర్కొన్నారు . ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు . ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 26వ తేదీలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ డిమాండ్ పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద ఉద్యమకారులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు , అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు . తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే వేగవంతం చేసి , పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు . ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు , ధర్నాలు , ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో పగడాల నరేందర్ , లింగానబోయిన సతీష్ , డో కుపర్తి సుబ్బారావు , రెడ్డబోయిన వరలక్ష్మి , కామని అనంత లక్మి , స్వరూప రెడ్డి , కమలమ్మ , ధన లక్మీ , యాక  లక్ష్మీ తదితరులు ఉన్నారు .

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి.
- కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జారె పిలుపు.- దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన. దమ్మపేట, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్...
రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ.
సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు.
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ.
నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.
వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
29న పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశం.