29న పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశం.
హాజరుకానున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
--పెద్దమందడి ఎంపీడీవో పరిణత
పెద్దమందడి,అక్టోబర్26(తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణమే లక్ష్యంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఈ నెల 29న సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పరిణత తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు పెద్దమందడిలోని రైతు వేదికలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పంచాయతీల పనితీరు మెరుగుదల, గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు.ఈ సమావేశానికి పెద్దమందడి మండలంలోని సర్పంచులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో పరిణత సూచించారు. అదేవిధంగా మండలంలోని పాత్రికేయులు సమావేశానికి హాజరుకావాలని ఆమె కోరారు.


Comments