నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.

నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.

*నాలుగు డివిజన్లలో పర్యటించి రూ.68 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మేయర్ కొలగాని శ్రీనివాస్.*

కరీంనగర్, అక్టోబర్ 26(తెలంగాణ ముచ్చట్లు ):

నగర అభివృద్ధే ధ్యేయంగా తమ పాలకవర్గం పనిచేస్తోందని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం 1, 2, 32, 34 డివిజన్లలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మొదటగా 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలో నగరపాలక సంస్థకు చెందిన రూ.11 లక్షల సాధారణ నిధులతో ఎస్‌డబ్ల్యూజీ పైపులైన్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 32వ డివిజన్ హుస్సేన్‌పురలో స్థానిక కార్పొరేటర్ షేక్ యూసుఫ్‌తో కలిసి యూఐడీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

అదేవిధంగా 34వ డివిజన్ హుస్సేన్‌పురలో స్థానిక కార్పొరేటర్ సమీనా పర్వీన్‌తో కలిసి యూఐడీఎఫ్‌కు చెందిన రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 1వ డివిజన్ ఆరేపల్లిలో స్థానిక కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్‌తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన రూ.27 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించినప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారుIMG-20261026-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి.
- కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జారె పిలుపు.- దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన. దమ్మపేట, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్...
రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ.
సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు.
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ.
నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.
వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
29న పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశం.