చదువుతో పాటు సామాజిక అవగాహన అవసరం: పుష్కూరి కార్తీక్ రావు.

ఆల్టిట్యూడ్ పాఠశాలలో బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

చదువుతో పాటు సామాజిక అవగాహన అవసరం: పుష్కూరి కార్తీక్ రావు.

ఎల్కతుర్తి అక్టోబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు): 

విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు క్రమశిక్షణతో కష్టపడి చదవాలని ఆల్టిట్యూడ్ పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కాIMG-20261026-WA0050ర్తీక్ రావు అన్నారు. ఎల్కతుర్తి మండలంలోని ఆల్టిట్యూడ్ పాఠశాలలో షేర్ ఎన్‌జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణ, పోలీసుల సహాయం, హెల్ప్‌లైన్ నంబర్లు, ఆన్‌లైన్ భద్రత, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. చదువుతో పాటు సమాజంలో జరిగే సమస్యలు, వాటిని ఎదుర్కొనే విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు.

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలని సూచించారు.

బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన

షేర్ ఎన్‌జీవో ప్రతినిధి జగన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నా, అలాంటి ఘటనలు తెలిసినా సంబంధిత అధికారులకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి, హెల్ప్‌లైన్ నంబర్లను ఎలా వినియోగించుకోవాలి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు.

అలాగే, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను తెరవడం, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే పెద్దలకు తెలియజేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మర్రి అశోక్, వైస్ ప్రిన్సిపల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రే తిరుపతి, ఉపాధ్యాయులు సురేష్, ఆశా, బేగం, సుమలత, మమత, లలిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి.
- కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జారె పిలుపు.- దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన. దమ్మపేట, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్...
రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ.
సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు.
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ.
నగరాభివృద్ధే మా పాలకవర్గం ధ్యేయం.
వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
29న పెద్దమందడి మండల సర్వసభ్య సమావేశం.