వెల్టూర్ ఎక్స్‌రోడ్డులో ఎక్స్‌ప్రెస్ బస్సుల స్టాప్‌కు గ్రీన్‌సిగ్నల్.
ఎమ్మెల్యే మేఘారెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వడ్డే శేఖర్ .
పెద్దమందడి,అక్టోబర్26(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సుల నిలుపుదలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. నేటి నుంచి వనపర్తి నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులు వెల్టూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆగనున్నాయని వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ తెలిపారు. ఈ మేరకు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.గతంలో వెల్టూర్ ఎక్స్‌రోడ్డు వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలని కోరుతూ వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రాలు అందజేసినట్లు వడ్డే శేఖర్ తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో ప్రయాణికుల సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు.ఇకపై ప్రయాణికులు టికెట్ తీసుకునే సమయంలో వెల్టూర్ ఎక్స్‌రోడ్డు అని చెప్పి టికెట్ పొందవచ్చని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా వెల్టూర్ స్టేజ్ వద్ద బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో వెల్టూర్ గ్రామ ప్రజల కోరికలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని వడ్డే శేఖర్ పేర్కొన్నారు. ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల నిలుపుదల సదుపాయాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వెల్టూర్ ప్రజల విజ్ఞప్తికి
స్పందించి బస్సుల నిలుపుదలకు చొరవ చూపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి, ఆర్టీసీ అధికారులకు వడ్డే శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Comments