ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఐఈఓ.
విద్యార్థులతో మాట్లాడి విద్యా, ప్రాక్టికల్స్, శిక్షణ వివరాలు తెలుసుకున్న డీఐఈఓ.
సత్తుపల్లి, అక్టోబరు 26 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు సత్తుపల్లిలోని శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యా కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న శిక్షణపై వివరాలు తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యసన విధానాలను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ విద్యార్థులను ప్రాక్టికల్స్ నిర్వహణ గురించి, ఆర్ట్స్ విద్యార్థులను వివిధ యాక్టివిటీల గురించి, ఒకేషనల్ విద్యార్థులను ఓజేటీ (ఆన్ జాబ్ ట్రైనింగ్) కార్యక్రమం గురించి ప్రశ్నించి వివరాలు సేకరించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలోని 1970లో నిర్మించిన పాత భవనాలను పరిశీలించారు. అందులోని గదుల పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, సంబంధిత వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ తనిఖీలో కళాశాల ప్రిన్సిపాల్ గుడిపాటి లక్ష్మయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.


Comments