వెల్టూర్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు.
పెద్దమందడి,అక్టోబర్26(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయణ మహాకావ్యాన్ని రచించి, తన రచనల ద్వారా ధర్మం, నీతి, మానవతా విలువలను ప్రపంచానికి చాటిన వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ నివాళులర్పించారు.రామాయణ మహాకావ్యాన్ని రచించి ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి మహర్షి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణం తరతరాలకు ధర్మమార్గాన్ని బోధిస్తూ సమాజానికి స్ఫూర్తినిస్తోందని కొనియాడారు. వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలను ఆచరించాలని వాల్మీకి సంఘం నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లక్ సురేష్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య, జనంపేట రాములు, మల్లక్ పెద్ద భీమన్న, జల్లి చిన్న కాశన్న, బి. శ్రీను, గుర్రాల కుర్మయ్య, శాఖ మన్నెం, జింకల కుర్మయ్య, మల్లక్ కృష్ణయ్య, ముమ్మాల్లా వెంకటయ్య, మల్లక్ రాము, బి. రాజు తదితర వాల్మీకి సంఘం సభ్యులు పాల్గొన్నారు.


Comments