రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరణ.
- పోటీలను విజయవంతం చేయాలి.
- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.
సత్తుపల్లి, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లిలో నిర్వహించనున్న 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీల పోస్టర్‌ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం ఆవిష్కరించారు. గండుగలపల్లి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు. మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో, మువ్వా యూత్ సత్తుపల్లి ఆధ్వర్యాన ఈ పోటీలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ వేదికగా జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా క్రీడాకారిణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. మహిళలు క్రీడారంగంలో మరింతగా రాణించేందుకు రాష్ట్రస్థాయి పోటీలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించాలని సూచించారు. పోటీలను విజయవంతం చేసేందుకు క్రీడాభిమానులు, యువత, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.


Comments