నగరపాలక సంస్థలో ఘనంగా దీపావళి వేడుకలు.
Views: 0
On
కరీంనగర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన లక్ష్మీపూజ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, చాడగొండ బుచ్చిరెడ్డి, అడిషనల్ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మోహియోద్దీన్, అయాజ్, అధికారులు, సిబ్బంది సునీల్ కుమార్, సుంచు నర్సయ్య, టి.వెంకటేష్, దుర్గం సంధ్య, తేజస్విని, హరిత, త్రివేణి, విజయలక్ష్మి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Nov 2026 21:36:07
సిగరెట్, బీడీలు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎస్‌ఐ జి. నరేష్
ఖమ్మం బ్యూరో, నవంబర్ 7(తెలంగాణ ముచ్చట్లు )
దీపావళి సందర్భంగా బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన...


Comments