అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
రక్తసంబంధం, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా భోగి హస్త భోజన వేడుక
అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్ల ఆప్యాయతతో హస్త భోజనం..
తొమ్మిది రకాల వంటకాలతో సంప్రదాయబద్ధంగా వేడుక
హనుమకొండ, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే రక్తసంబంధానికి, అనుబంధానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ అక్కాచెల్లెళ్లు ప్రేమతో వంటలు చేసి వడ్డించే హస్త భోజన వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలను నింపింది.
ఈ సందర్భంగా ఘన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన కొలిపాక సతీష్ చెల్లెలు సింగారపు శైలజ తన అన్నదమ్ములైన కొలిపాక సతీష్, శ్రీకాంత్‌లను హనుమకొండలోని తన నివాసానికి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా దీపంతో హారతి ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు.అనంతరం తన చేతులతో స్వయంగా తయారుచేసిన తొమ్మిది రకాల వంటకాలను అరటి ఆకులో వడ్డించారు. పప్పు, చారు, పెరుగు, తీపి పదార్థాలతో పాటు పలు రకాల రుచికరమైన వంటకాలను ప్రేమతో వడ్డించి అన్నదమ్ములకు స్వయంగా తినిపించారు. అక్కాచెల్లెళ్ల చేతి వంటలోని రుచితో పాటు వారి ఆప్యాయత, ప్రేమానురాగాలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అన్నదమ్ములకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ సింగారపు శైలజ నిర్వహించిన ఈ వేడుక కుటుంబ బంధాల గొప్పతనాన్ని చాటిచెప్పింది.రక్తసంబంధాల మధ్య ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేసే ఇలాంటి సంప్రదాయాలు భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో కొలిపాక సతీష్, శ్రీకాంత్, కిట్టు, సింగారపు శ్రీనివాస్, సిద్ధార్థ్, దేవాన్ష్, సిరి తదితరులు పాల్గొన్నారు.


Comments