బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న షాపుల లైసెన్సులు రద్దు చేయాలి.

బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలి.

జమ్మికుంట, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల పరిధిలోని వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జమ్మికుంట ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు అంగిడి కుమార్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం, మండలంతో పాటు ఇల్లందకుంట మండల పరిధిలోని పలు వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపించారు. పర్మిట్ రూముల పరిధిని మించి బార్లను తలపించేలా నిర్వహిస్తున్నారని, లైసెన్స్ ఒకరి పేరు మీద ఉండగా మరొకరు వైన్ షాపులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వైన్ షాపుల యాజమాన్యాలపై ఎక్సైజ్ అధికారులు సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలిన వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి లోకి, జిల్లా ఉపాధ్యక్షులు వెల్ది రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!