మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.

- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి.

అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు): 

మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన భారీ నష్టాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను కలిసి నియోజకవర్గంలోని పరిస్థితులను వివరించారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, వంతెనలు, చెరువులు, కాలువలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. తుఫాన్‌ ప్రభావంతో పంటలు, ఆస్తులు నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకోవాలని, నష్ట నివారణతో పాటు పునరుద్ధరణ పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే, తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!