ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం.

వనపర్తి,నవంబర్11(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి పనులతో నిలబెట్టుకుంటానని, నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పెద్ద జీతగాడిలా పనిచేస్తానని పేర్కొన్నారు.బుధవారం ఏదుల రిజర్వాయర్ నుంచి డీ-5 కాలువ ద్వారా ఏదుల, అనంతపురం గ్రామాల చెరువులకు నీటిని విడుదల చేశారు. తన ప్రత్యేక చొరవతో, సొంత నిధులతో అవసరమైన పనులు చేపట్టించి చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ అధికారులు డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ నీటిని విడుదల చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరువు పేరుతో బీఆర్ఎస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం అందించలేని వారు నేడు పరిహారం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండింగ్ పరిహారం అందించామని తెలిపారు.ఏదుల, కొంకలపల్లి, బండరావిపాకుల తదితర గ్రామాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైతుల సంక్షేమం, సాగునీరు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు సత్యశీలారెడ్డి, మండల అధ్యక్షుడు సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!