టీడీపీ గౌస్‌ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు.
వనపర్తి,నవంబర్10(తెలంగాణ ముచ్చట్లు):
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న టీడీపీ గౌస్‌ను సాహితీ కళా వేదిక సభ్యులు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న గౌస్ రెండు రోజుల క్రితం వనపర్తికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కళా వేదిక ప్రతినిధులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. గౌస్‌కు ధైర్యం చెప్పారు.అనంతరం గౌస్ తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో కొనసాగుతున్న తనకు మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆర్థిక సహాయం అందించి శస్త్రచికిత్స చేయించారని కాగితంపై రాసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు, గద్దె భాస్కర్, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments