జర్నలిస్టుల జాతీయ పురస్కారం–2026కు ధనుష్ ఎంపిక.
ప్రజా సమస్యలపై తన కలాన్ని కొనసాగిస్తా
-- జర్నలిస్టు ధనుష్
కొత్తకోట,అక్టోబర్27(తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిజం రంగంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ విశేష కృషి చేస్తున్న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి వనపర్తి జర్నలిస్టు ధనుష్ జాతీయ జర్నలిస్టుల పురస్కారం–2026కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆయనకు అవార్డును అందజేయనున్నారు.ధనుష్ జర్నలిస్టుగా ప్రజా సమస్యలను సమాజం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల సమస్యలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీల మోహన్ కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్ ప్రసాద్ ఆయనను జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ గుర్తింపు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.తనకు ఈ గుర్తింపు రావడంలో సహకరించిన బ్యూరో చీఫ్, సీనియర్ మీడియా అడ్వైజర్ శ్రీధర్ యాలాల, దళిత జర్నలిస్ట్ ఫోరం జాతీయ అధ్యక్షుడు కాశపోగు జాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments