రేగులపల్లిలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం.

రేగులపల్లిలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం.

*ప్రజల వద్దకే ఎమ్మెల్యే..సమస్యల పరిష్కారమే లక్ష్యం.*


*క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించిన డా. కవ్వంపల్లి సత్యనారాయణ.*

మానకొండూర్, అక్టోబర్ 27(తెలంగాణ ముచ్చట్లు ):

మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం తదితర ప్రాథమిక సదుపాయాల పరిస్థితిని సమీక్షించారు.

అదేవిధంగా, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లను గ్రామస్థులతో కలిసి సందర్శించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు సకాలంలో, సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అనంతరం గ్రామస్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో IMG-20261027-WA0004చర్చించి, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్థులు తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!