మరువలేని స్నేహం.. చెరిగిపోని జ్యోతి జ్ఞాపకాలు.

మరువలేని స్నేహం.. చెరిగిపోని జ్యోతి జ్ఞాపకాలు.

 *పాత పాటల వీడియోలు చూస్తూ భావోద్వేగానికి గురవుతున్న 1987–88 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు* 

ఎల్కతుర్తి అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు): 

చిన్ననాటి స్నేహం.. పాఠశాల రోజుల్లో పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. పాటలతో తోటి విద్యార్థులను అలరించిన మద్దెల జ్యోతి ఇక తమ మధ్య లేదనే నిజాన్ని పూర్వ విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పాడిన పాటల వీడియోలను చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్‌ గ్రామానికి చెందిన జ్యోతి అంగన్‌వాడీ టీచర్‌గా 15 సంవత్సరాల పాటు సేవలందించారు. రెండేళ్ల క్రితం ఆమె మృతి చెందగా, అనంతరం అనారోగ్య కారణాలతో ఆమె భర్త కూడా మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

1987–88 సంవత్సరాల్లో పదో తరగతి చదువుకున్న సమయంలో జ్యోతి పాటలు పాడుతూ, కబడ్డీ, ఖోఖో వంటి ఆటల్లో పాల్గొంటూ సహచర విద్యార్థులను అలరించేవారు. ముఖ్యంగా అంబేద్కర్‌ పాటలను మధురమైన గాత్రంతో పాడుతూ అందరి ప్రశంసలు పొందేవారు. ప్రస్తుతం ఆమె పాఠశాల రోజుల్లో పాటలు పాడిన వీడియోలను చూస్తున్న స్నేహితులు భావోద్వేగానికి గురవుతున్నారు.

“జ్యోతి మా మధ్య లేకపోవడం తీరని లోటు. ఆమె పాటలు, నవ్వులు, మాతో గడిపిన పాఠశాల రోజులు ఎప్పటికీ మర్చిపోలేం. ఆమె పాడిన పాటల వీడియోలు చూసినప్పుడల్లా మా మధ్యే ఉన్నట్లు అనిపిస్తుంది” అంటూ 1987–88 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జ్యోతి భౌతికంగా దూరమైనా, ఆమెతో పంచుకున్న స్నేహం, మధుర జ్ఞాపకాలు తమ హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోవని పూర్వ విద్యార్థులు భావోద్వేగంతో గుర్తుచేసుకుంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!